రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం.. 24 గంటల్లో 10,093 కేసులు - ఏపీలో ఈరోజు కరోనా కేసులు
18:05 July 29
17:34 July 29
రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. తాజాగా గత 24 గంటల్లో (9ఏఎం-9పీఎం) 70,584 నమూనాలను పరీక్షించగా 10,093 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,20,390కి చేరింది. తాజాగా కొవిడ్-19 నుంచి మరో 2,784 మంది కోలుకోగా.. మొత్తం 55,406 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు ప్రభుత్వం తెలిపింది. వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 63,771 మంది చికిత్స పొందుతున్నట్లు బులిటెన్‌లో పేర్కొంది.
గడచిన 24 గంటల్లో తూర్పుగోదావరిలో 14, అనంతపురం 8, విజయనగరం 7, చిత్తూరు 6, కర్నూలు, నెల్లూరులో ఐదుగురు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో నలుగురు, గుంటూరు, కడపలో ముగ్గురు, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందారు. కరోనాతో ఇప్పటి వరకు మొత్తం 1,213 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 18,20,009 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.