పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పోలీస్ స్టేషన్లో ఉంచిన మద్యం దుకాణాల నగదు చోరీ చేసిన ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వీరవాసరం పోలీస్‌స్టేషన్‌కి చెందిన కానిస్టేబుళ్లు గంగాజలం, గణేశ్వరరావులను విధుల నుంచి తొలగించారు. కానిస్టేబుళ్లు పోలీస్‌స్టేషన్‌లో మద్యం దుకాణాల సొమ్ము చోరీకి పాల్పడినట్లు తెలిపారు. అలాగే ఎస్ఐ రామచంద్రరావు, ఏఎస్ఐ ఎం.మోహనరావులను వీఆర్‌కు పంపారు.
పోలీస్ స్టేషన్లో నగదు చోరీ.. ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్
పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
కానిస్టేబుళ్లు సస్పెండ్
Last Updated : Mar 26, 2021, 3:14 PM IST