ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: మంత్రి హరీష్​రావు వ్యాఖ్యలపై విజయశాంతి ఆరోపణలు

తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్​రావు చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని పీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ విజయశాంతి ఆరోపించారు. అధికారపార్టీ అరాచకాలపై దుబ్బాక ఓటర్లకు స్పష్టత వచ్చి ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.

vijayashanthi
పీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ విజయశాంతి

By

Published : Oct 29, 2020, 10:49 AM IST

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికలో కాంగ్రెస్, భాజపాలకు డిపాజిట్ కూడా రాదని మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలు అనుమానాలకు తావిస్తున్నాయని పీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ విజయశాంతి ఆరోపించారు. ఎన్నికలకు ముందే ఫలితాలెలా ఉండాలో తెరాస నిర్ణయించే స్థాయికి వెళ్లిపోయిందంటే అధికారపార్టీ అరాచకాలపై దుబ్బాక ఓటర్లకు స్పష్టత వచ్చి ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. హరీష్‌రావు వ్యాఖ్యలు చూస్తుంటే... దుబ్బాక పోలింగ్ తర్వాత కేసీఆర్ ఫాంహౌస్‌లో ఈవీఎంలు పెట్టి ఓట్లు లెక్కిస్తారేమోనన్న అనుమానం వస్తోందని ఎద్దేవా చేశారు. అధికారపార్టీ ఎమ్మెల్యే మరణంతో జరిగే ఉపఎన్నిక గురించి తెరాస, ముఖ్యంగా హరీష్‌రావు హైరానా ఎందుకో ఎవరికీ అంతు పట్టడం లేదన్నారు.

కాంగ్రెస్, భాజపాలకు గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఉపఎన్నికలో ఎక్కువ ఓట్లు వస్తే.. ఆ ప్రభావం హరీష్ రావు మంత్రి పదవిపై పడుతుందని సీఎం కేసీఆర్ ఏదైనా అల్టిమేటం ఇచ్చారా? అన్న చర్చ కూడా జరుగుతోందని విజయశాంతి ఆరోపించారు. అందుకే తెలంగాణ ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు, కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు మెదక్ జిల్లాకు కేటాయించిన నిధుల కంటే... దుబ్బాకలో ఓటర్లను కొనేందుకు ఖర్చు చేస్తున్న మొత్తం ఎక్కువని ప్రచారం జరుగుతోందని అన్నారు.

ఇవీ చూడండి: స్థానికంపై సమరం...కొత్త నోటిఫికేషన్​కు విపక్షాలు పట్టు

ABOUT THE AUTHOR

...view details