జిల్లాస్థాయిలో పరిపాలనా వ్యవస్థల్లో మార్పు చేర్పులకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. జిల్లాల్లోని ముగ్గురు జాయింట్ కలెక్టర్లకు అధికారాలు.. బాధ్యతల కేటాయింపుపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో పది మంది సభ్యులతో కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కమిటీలో సభ్యులుగా సీసీఎల్ కమిషనర్ సహా వ్యవసాయ, విద్యా, వైద్యం, పంచాయితీరాజ్, గ్రామ సచివాలయాలు, పట్టణాభివృద్ధి, సాంఘిక సంక్షేమం, జీఏడీ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. 14 రోజుల్లో ఈ కమిటీ నివేదికను సమర్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బాధ్యత కేటాయింపులకు అధ్యయన కమిటీ - administration changes commiittee
జిల్లాలోని ముగ్గురు జాయింట్ కలెక్టర్లకు అధికారాలు.. బాధ్యతల కేటాయింపులపై అధ్యయనానికి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
బాధ్యత కేటాయింపులకు అధ్యయన కమిటీ