ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం డిక్లరేషన్ ఇవ్వలేదని పిటిషన్.. మరో బెంచ్​కు బదిలీ

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకపోవడం.. దేవాదాయ చట్టంలోని సెక్షన్ 97, 153 లకు విరుద్ధమని గుంటూరు జిల్లా అమరావతి మండలానికి చెందిన ఎ.సుధాకర్ బాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో దాఖలైన కో-వారెంట్​ పిటిషన్ వేరే బెంచ్​కు బదిలీ కానుంది.

Co Warrant petition filed on cm in high court
హైకోర్టులో దాఖలైన కోవారెంటో పిటిషన్ వేరే బెంచ్​కు బదిలీ

By

Published : Sep 30, 2020, 8:37 AM IST

సీఎం జగన్‌, మంత్రులు వెల్లంపల్లి, కొడాలి నాని, తితిదే ఛైర్మన్, ఈవో వారి పదవులు, పోస్టుల్లో ఏ అధికారంలో కొనసాగుతున్నారో వివరణ కోరాలని హైకోర్టును అభ్యర్థిస్తూ దాఖలైన కో-వారెంట్​ పిటిషన్‌ వేరే బెంచ్‌కు బదిలీ కానుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇవ్వకపోవడం చట్టవిరుద్ధమంటూ ఇటీవల పిటిషన్‌ దాఖలైంది. డిక్లరేషన్ అవసరం లేదని మంత్రులు మద్దతు పలికారని తితిదే ఛైర్మన్, ఈవో నిబంధనల అమల్లో విఫలమయ్యారని ఈ నేపథ్యంలో వారు తమ పదవులు, పోస్టుల బాధ్యతలు నిర్వర్తించకుండా నిలువరించాలని పిటిషన్‌లో కోరారు. జస్టిస్‌ ఏవీ శేషసాయి వద్ద మంగళవారం ఈ వ్యాజ్యం విచారణకు వచ్చింది. తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌ తరఫున హాజరవుతున్నట్టు సీనియర్‌ వైవీ రవిప్రసాద్‌ తెలిపారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి వ్యాజ్యం వేరే బెంచ్‌ ముందుకు విచారణకు వచ్చేలా తగిన నిర్ణయం తీసుకునేందుకు దస్త్రాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరికి నివేదించాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details