కృష్ణానది వరదలపై అమెరికా నుంచి ఫోన్ ద్వారా ముఖ్యమంత్రి జగన్ సమీక్ష చేశారు. సీఎంవో అధికారులు పంపిన నివేదికలను ఆయన పరిశీలించారు. ఎగువనుంచి వస్తున్నవరద, విడుదల చేస్తున్న జలాలపై ఆరా తీశారు. ముంపు బాధిత ప్రాంతాల్లో తీసుకుంటున్నచర్యలపై సమాచారం తెలుసుకున్నారు. బాధితులకు తక్షణమే సాయం అందించమని, ఎలాంటి అలసత్వం చూపించవద్దని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టిందని సీఎం జగన్‌కు సీఎంవో అధికారులు తెలిపారు. వరద సహాయ కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయని వివరించారు.
డల్లాస్‌కు మఖ్యమంత్రి