ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రజనీకాంత్​కు తెలంగాణ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారం.. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రజనీకాంత్​కు రావడంపై తెలంగాణ సీఎం కేసీఆర్​ హర్షం వ్యక్తం చేశారు. సూపర్ స్టార్​కు శుభాకాంక్షలు తెలిపారు.

By

Published : Apr 1, 2021, 5:04 PM IST

cm kcr wishes to actor rajanikanth
రజనీకాంత్​కు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్​

సూపర్​ స్టార్ రజనీకాంత్​కు సినిమా రంగంలో​ అత్యన్నత పురస్కారం దాదాసాహెబ్​ ఫాల్కే అవార్డు రావడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ సంతోషం వ్యక్తం చేశారు. రజనీకాంత్​ హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించి విశేష ఆదరణ పొందారన్నారు. సామాజిక సేవలో సూపర్​ స్టార్​ ముందున్నారని ప్రశంసించారు.

హీరో అయినా సాధారణ వ్యక్తిలా రజనీకాంత్​ ఉంటారని.. ఇది ఆయన గొప్ప గుణానికి నిదర్శమని కేసీఆర్ అన్నారు. ఇలాంటి మరెన్నో అవార్డులు పొందాలని ఆకాంక్షించారు. రజనీకాంత్​కు శుభాకాంక్షలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details