KCR Visited Srirangam Ranganathaswamy: తమిళనాడులో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీరంగం రంగనాథస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంకు జిల్లా కలెక్టర్ శివరాసు, ఆలయాధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరు పుజారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రాముఖ్యతను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి దంపతులు ఆలయ ప్రధాన ఏనుగుకు పండ్లు అందజేసి.. గజరాజు నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా తమిళనాడు పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.