ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చిన్నారికి 'సీఎం తాతయ్య' అభయం.. చికిత్స చేయించేందుకు హామీ! - Telangana news

ఈటీవీ భారత్​ కథనానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. 'కేసీఆర్‌ తాతా నన్ను బతికించవా ప్లీజ్‌' కథనానికి ఆయన చలించారు. చైత్రకు నయం అయ్యేంతవరకు చికిత్స జరిపిస్తామని హామీ ఇచ్చారు. ఆ విషయాన్ని ఆ చిన్నారి కుటుంబానికి తన తరఫున తెలియజేయాలని ప్రతినిధిని సైతం పంపించారు.

CM KCR responding to ETV Telangana
ఈటీవీ భారత్​ కథనంపై సీఎం కేసీఆర్ స్పందన

By

Published : Apr 12, 2021, 1:52 PM IST

ఈటీవీ భారత్​ కథనానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. 'కేసీఆర్‌ తాతా నన్ను బతికించవా ప్లీజ్‌' కథనంపై సీఎం స్పందించిన ఆయన.. చైత్రకు బాగు అయ్యేంతవరకు చికిత్స జరిపిస్తామని హామీ ఇచ్చారు. చైత్ర చికిత్స బాధ్యతను ప్రభుత్వమే తీసుకుటుందని ఆయన భరోసానిచ్చారు. సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు సీఎం ఫోన్ చేసి విషయం తెలిపారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో అనుముల మండలం ఇన్‌ఛార్జిగా ఎమ్మెల్యే కోనప్ప కొనసాగుతున్నారు. సీఎం ఆదేశాల మేరకు చైత్ర ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే.. కేసీఆర్ ఇచ్చిన హామీని చైత్ర తల్లిదండ్రులకు తెలిపారు.

చైత్ర తల్లిదండ్రులతో ఎమ్మెల్యే కోనప్ప

ఈటీవీ భారత్​లో వచ్చిన కథనాన్ని సీఎం చూశారు. చైత్రకు వైద్యం చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. చైత్ర తల్లిదండ్రులు రేపు కలవాలని సీఎం సూచించారు.

--- కోనప్ప, ఎమ్మెల్యే

సీఎం ఇచ్చిన హామీని ఈటీవీ భారత్​ ప్రతినిధికి ఎమ్మెల్యే కోనప్ప తెలియజేశారు.

ఇదీ చూడండి:

కరవును జయించిన కలియుగ 'భగీరథీ'

ABOUT THE AUTHOR

...view details