నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నందున.. వైకాపా ఎంపీలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు... వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై.. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల సాధనపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.
వైకాపా ఎంపీలతో సమావేశం కానున్న సీఎం జగన్ - cm jagan latest news
వైకాపా ఎంపీలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు... వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై.. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్‌లో చర్చకు తీసుకురావాలని సూచించే అవకాశం ఉంది.
ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్‌లో చర్చకు తీసుకురావాలని సూచించే అవకాశం ఉంది. జీఎస్టీ బకాయిలు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులతో పాటు... రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు నిధుల సాధన లక్ష్యంగా పనిచేయాలని నిర్దేశిస్తారని సమాచారం. కేంద్రం నుంచి కరోనా సాయంపైనా ఎంపీలతో సీఎం చర్చించనున్నారు. పార్లమెంట్‌లో రాష్ట్ర సమస్యలను ప్రస్తావించి... పరిష్కారం దిశగా ఒత్తిడి పెంచడంపై సీఎం జగన్ సూచనలు చేయనున్నట్లు వైకాపా వర్గాలు వెల్లడించాయి.
ఇదీ చదవండీ... రాష్ట్రంలో తగ్గని కరోనా ఉద్ధృతి..కొత్తగా 9,536 కరోనా కేసులు