పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం జగన్ సమీక్ష చేశారు. వివిధ పథకాల కింద అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. విశాఖ, కాకినాడ, తిరుపతి నగరాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించారు. విశాఖకు నిరంతరాయంగా తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. పోలవరం నుంచి నేరుగా భూగర్భ పైప్‌లైన్ ద్వారా తాగునీటి సరఫరాకు చేయాలని అధికారులకు సూచించారు.
ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకూ ట్రామ్ రవాణా
విశాఖ మెట్రో రైలుపై ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ట్రామ్ తరహా ప్రజారవాణా ఆలోచన చేయాలని అన్నారు. ఈ అంశంపై డీపీఆర్ తయారీకి త్వరలో కన్సల్టెన్సీ నియామకం చేపట్టాలని చెప్పారు. విశాఖలో లక్షన్నర మందికి ఇళ్లపట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
గృహ నిర్మాణాల్లో రివర్స్ టెండరింగ్.. రూ.303 కోట్లు ఆదా
పట్టణాల్లో గృహ నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఇప్పటివరకూ 48 వేల 608 హౌసింగ్ యూనిట్లకు రివర్స్ టెండరింగ్ నిర్వహించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.303 కోట్లు మిగిలినట్లు అధికారులు వివరించారు. మిగిలిన యూనిట్లకు త్వరలో రివర్స్ టెండరింగ్ పూర్తిచేస్తామన్నారు. స్పెసిఫికేషన్స్ మార్చకుండా రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని సీఎం అధికారులకు సూచించారు. పట్టణ గృహనిర్మాణంలో డ్రైనేజీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భూగర్భ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి పనులను దశల వారీగా, ప్రాధాన్యత ప్రకారం మున్సిపాలిటీల్లో చేపట్టాలన్నారు. జనాభాను దృష్టిలో ఉంచుకుని పనులు చేపట్టాలని సీఎం సూచించారు.
ఆ మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారి