ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM Jagan: ధాన్యం సేకరణలో మిల్లర్ల పాత్రకు చెక్​.. ఇకపై వాలంటీర్ల సేవలు - ఏపీ తాజా వార్తలు

CM Jagan review on agriculture : ధాన్యం సేకరణలో వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సేవలంచినందుకు వాలంటీర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రతిపాదించారు. వీటిపై సమగ్రంగా విధివిధానాలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ధాన్యం సేకరణలో మిల్లర్ల పాత్ర పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. వచ్చే రెండు నెలల్లో మరో 1,359 గ్రామాలకు అమూల్‌ పాల సేకరణ విస్తరించనున్నట్లు తెలిపారు. రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు యంత్రాలు, పరికరాలను అందుబాటులో ఉంచాలని సీఎం తెలిపారు. ఈ ఏడాది 7 లక్షల మంది రైతులకు యంత్రాలు, పరికరాలు అందించాలని, ఈ మేరకు కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం నిర్దేశించారు.

CM Jagan review on agriculture
సీఎం జగన్​

By

Published : Sep 8, 2022, 7:00 PM IST

Updated : Sep 9, 2022, 6:31 AM IST

ధాన్యం సేకరణ

CM Jagan review on agriculture : వ్యవసాయ అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, సీదిరి అప్పలరాజు, సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ యంత్రాల పంపిణీ ప్రగతిపై సీఎం సమీక్షించారు. ఈ ఏడాది 10,750 ఆర్బీకేల పరిధిలో ఇప్పటికే 6,525 ఆర్బీకేల్లో యంత్రసేవ కింద వ్యవసాయ ఉపకరణాల పంపిణీ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. 1,615 క్లస్టర్‌ లెవల్‌ సీహెచ్‌సీల్లో 391 చోట్ల ఇప్పటికే యంత్రసేవ కింద హార్వెస్టర్లతో పాటు పలు రకాల యంత్రాలు ఆర్బీకేలకు పంపిణీ చేసినట్లు చెప్పారు. రూ.690.87 కోట్ల విలువైన పరికరాలు ప్రభుత్వం అందించిందని... వీటిలో రూ.240.67 కోట్ల సబ్సిడీ ప్రభుత్వం అందించినట్లు పేర్కొన్నారు.

ఆర్బీకేల పరిధిలో వైయస్సార్‌ యంత్రసేవ కింద ఇస్తున్న పరికరాలు, యంత్రాలు అన్నీ రైతులకు అందుబాటులో ఉండాలని అధికారులను సీఎం జగన్​ ఆదేశించారు. ఆర్బీకేలో ఉన్న యంత్రాలు, వాటి వల్ల అందుతున్న సేవలతో సమగ్రంగా పోస్టర్లు ప్రదర్శించాలని తెలిపారు. మిగిలిన ఆర్బీకేలోనూ 2022–23కి సంబంధించి యంత్ర సేవకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. సుమారు 7 లక్షల మందికి యంత్రాలు, పరికరాలు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. వీరిలో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులకు, మిగిలిన 20 శాతం ఇతరులకు యంత్రసేవ కింద పరికరాలు అందించాలన్నారు. షెడ్యూల్డ్‌ ఏరియాల్లో 80 శాతం ఎస్టీ రైతులకు ఇవ్వాలని నిర్ణయించారు. ఆర్బీకే యూనిట్‌గా వీటి పంపిణీ జరగాలన్నారు. దీనికోసం రూ.1,325 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. వీటిలో ప్రభుత్వ సబ్సిడీగా 1,014 కోట్లు ఇవ్వాలని నిర్దేశించారు.

ఆర్బీకేల పరిధిలో కలెక్షన్‌ సెంటర్లు, కోల్డ్‌రూమ్‌లు, గోదాముల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వీలైనంత త్వరగా వీటి నిర్మాణాలు పూర్తిచేయాలన్నారు. చేయూత ద్వారా సుస్థిర ఆర్థిక ప్రగతికి, స్వయం ఉపాధి పథకాలు కొనసాగించాలని సీఎం నిర్దేశించారు. మహిళలకు పశువులను పంపిణీ చేయడం ద్వారా పాల ఉత్పత్తి, విక్రయం తదితర వ్యాపారాల ప్రక్రియ కొనసాగాలని దీనివల్ల మహిళల్లో ఆర్థిక స్వావలంబన జరుగుతుందన్నారు. అమూల్, అలానా లాంటి కంపెనీలతో భాగస్వామ్యం వల్ల లబ్ధిదారులైన మహిళలకు ఆర్థికంగా ప్రయోజనం పొందేలా చూడాలన్నారు.

అమూల్‌ పాలసేకరణపైనా సీఎం సమీక్షించారు. ప్రస్తుతం 2 లక్షల 34 వేల 548 మహిళా రైతుల నుంచి అమూల్‌ పాల సేకరణ జరుగుతుందని ఇప్పటి వరకూ 419.51 లక్షల లీటర్ల పాల సేకరణ చేస్తున్నట్లు తెలిపారు. పాలసేకరణ వల్ల ఇప్పటివరకూ రూ.179.65 కోట్ల చెల్లించినట్లు తెలిపారు. రైతులకు అదనంగా రూ.20.66 కోట్ల లబ్ది చేకూరినట్లు తెలిపారు. అమూల్‌ ప్రాజెక్టు వల్ల ఇతర డెయిరీలు పాల సేకరణ ధరలు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని సీఎం అన్నారు. ఆయా డైరీలు ధరలు పెంచడం వల్ల రాష్ట్రంలో రైతులకు అదనంగా 2 వేల 20.46 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. వచ్చే రెండు నెలల్లో మరో 1,359 గ్రామాలకు అమూల్‌ పాలసేకరణ విస్తరించనున్నట్లు తెలిపారు. అమూల్‌తో ప్రాజెక్టు ద్వారా ప్రతిరోజూ 1.03 లక్షల లీటర్ల పాలసేకరణ చేయనున్నట్లు తెలిపారు. చిత్తూరు డెయిరీని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ధాన్యం సేకరణపై..: ధాన్యం సేకరణలో మిల్లర్ల పాత్రను పూర్తిగా తొలంగించాలని సీఎం అధికారులను ఆదేశించారు. పారదర్శకంగా, రైతుల ప్రయోజనాలకు ఏ విధంగానూ భంగం రాకుండా ధాన్యం సేకరణ చేయాలని సీఎం ఆదేశించారు. వీటికోసం విధి విధానాలు రూపొందించినట్లు పౌరసరఫరాల సంస్థ అధికారులు తెలిపారు. ధాన్యం సేకరణలో వాలంటీర్లను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. వాలంటీర్ల సేవలను వినియోగించుకున్నందుకు ఇన్సెంటివ్‌లు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఎస్‌ఓపీలను పకడ్బందీగా తయారు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్​ ఆదేశించారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 9, 2022, 6:31 AM IST

ABOUT THE AUTHOR

...view details