మద్యం నియంత్రణపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ఎవరైనా మద్యం అమ్మితే కఠినచర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మద్యం అమ్మినట్టు ఫిర్యాదు రాగానే కచ్చితంగా వారిని అదుపులోకి తీసుకోవాలని, జైలుకు పంపాలన్నారు. మద్యం నియంత్రణపై టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచించారు. మద్యం నియంత్రణపైనా చట్టం తీసుకురావాలన్న సీఎం.. విధి విధానాలకు నిర్దేశించుకునేందుకు మరో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
అనుమతి లేకుండా మద్యం అమ్మితే జైలే..: సీఎం జగన్
మద్యం నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అనుమతి లేకుండా ఎవరైనా మద్యం అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మద్యం నియంత్రణకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
గ్రామాల్లో మద్యం అమ్మితే కఠినచర్యలు : సీఎం జగన్