ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'బోటు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కమిటీ'

బోటు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక కమిటీ వేయనున్నట్లు సీఎం జగన్​ తెలిపారు. అన్ని బోట్లను తక్షణమే నిలిపివేసి.. తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

By

Published : Sep 16, 2019, 6:08 PM IST

బోటు ప్రమాదంపై సీఎం స్పందన

బోటు ప్రమాదాలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్​ ఆదేశించారు. ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. గోదావరి, కృష్ణాతో సహా అన్ని నదుల్లో బోట్ల రవాణాపై పోలీస్‌, నీటిపారుదల, పర్యాటకశాఖల అధికారులతో వెంటనే ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న 81 బోట్లను తక్షణం నిలిపివేయాలన్నారు. బోట్లను పూర్తిగా తనిఖీ చేశాకే వాటిని అనుమతించాలన్నారు. భద్రతకు అవసరమైన నియమ నిబంధనలు రూపొందించాలని జగన్​ ఆదేశించారు.

ఉదయం బోటు ప్రమాదస్థలాన్ని విహంగవీక్షణం ద్వారా సీఎం పరిశీలించారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాజమహేంద్రవరంలోని ఆస్పత్రిలో చేరిన బాధితులను పరామర్శించారు. క్షతగాత్రులకు చికిత్స సక్రమంగా అందుతుందా లేదా అని వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details