ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కరోనా కట్టడిలో వారధిలా పనిచేయండి'

వైకాపా నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. కరోనా వ్యాప్తి నిరోధాన్ని అరికట్టేందుకు పార్టీ నేతలంతా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేయాలని సూచించారు. సామాజిక దూరం పాటించేలా ప్రజలను చైతన్య పరచాలని కోరారు. అధికారులతో సమన్వయం చేసుకుని అందరికీ నిత్యావసరాలు అందేలా చూడాలన్నారు. ఏవైనా సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.

Cm jagan
సీఎం జగన్

By

Published : Mar 30, 2020, 10:21 PM IST

పార్టీ నాయకులు, కార్యకర్తలకు వైకాపా అధ్యక్షుడు జగన్ దిశానిర్దేశం చేశారు. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు స్వీయ సామాజిక దూరం పాటించాలని సూచించారు. సామాజిక బాధ్యతగా ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలవాలన్నారు. బూత్ స్థాయి క్రియాశీలక కార్యకర్తలు, నాయకులకు బాధ్యతలు అప్పగించారు. వైరస్ నియంత్రణకు చర్యలు చేపడుతూనే ప్రజల్లో ధైర్యం నింపాలన్నారు. గుంపులు గుంపులుగా సంచరించకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్న జగన్‌... నిత్యావసర సరకులు ప్రజలకు అందుతున్నాయా లేదా గమనించాలని కోరారు. సరకుల పంపిణీలో లోపాలుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అధికారులతో సమన్వయం చేసుకుని అందరికీ నిత్యావసరాలు అందేలా చూడాలన్నారు.

రైతులకు అండగా నిలవండి: జగన్

మార్కెట్‌లో నిత్యావసర సరుకులు అధిక ధరలకు విక్రయించకుండా చూడాలని పార్టీ నేతలకు సీఎం జగన్ చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని కార్యకర్తలు, నేతలు అప్రమత్తం చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు ఆటంకం రాకుండా చూడాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాల్లో రైతుకు మేలు జరిగేలా చేసేందుకు పనిచేయాలన్నారు. వలస కార్మికులు, వ్యవసాయ కూలీలకు భోజన వసతి కల్పించాలన్న జగన్... ఏప్రిల్ 14 వరకు ఇంటికే పరిమితమయ్యేలా ప్రజలను చైతన్యపరచాలని పార్టీ నేతలకు చెప్పారు.

ఇదీ చదవండి :పట్టణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details