CM Jagan Met Governor : రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హరిచందన్ దంపతులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, భారతి దంపతులు మర్యాద పూర్వకంగా కలిశారు. సాయంత్రం రాజ్ భవన్కు చేరుకున్న ముఖ్యమంత్రికి గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా, రాజ్ భవన్ సంయుక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ తదితరులు స్వాగతం పలికారు. ఇటీవల కరోనా బారిన పడి పూర్తిగా కోలుకున్న గవర్నర్ దంపతులను ముఖ్యమంత్రి పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్య స్ధితిగతులను వాకబు చేశారు. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని గవర్నర్కు ముఖ్యమంత్రి విన్నవించారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు గవర్నర్ తెలిపారు.
CM Jagan Met Governor : గవర్నర్ దంపతులను కలిసిన సీఎం దంపతులు
CM Jagan Met Governor : రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతి దంపతులు మర్యాద పూర్వకంగా కలిశారు.
గవర్నర్ దంపతులను కలిసిన సీఎం దంపతులు