డిగ్రీ అధ్యాపకుల సాధారణ బదిలీలకు అవకాశం కల్పించే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి జగన్ ఆమోదం తెలిపారని ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. 2 ఏళ్ల సర్వీసు పూర్తయిన వారికి బదిలీలకు అర్హత కల్పిస్తూ ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుందన్నారు. 5 సంవత్సరాలు సర్వీసు ఓకే చోట పూర్తి అయిన వారికి తప్పని సరిగా బదిలీ కానున్నట్లు వెల్లడించారు.2023 జూన్ 30లోపు పదవి విరమణ పొందే వారికి బదిలీ నుంచి మిహాయింపు ఉంటుందని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. డిగ్రీ అధ్యాపకుల సాధారణ బదిలీలకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి ప్రభుత్వ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.
డిగ్రీ అధ్యాపకుల బదిలీలకు సీఎం ఆమోదం
డిగ్రీ అధ్యాపకుల బదిలీలకు అవకాశం కల్పించే ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపారని ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. 5 సంవత్సరాల సర్వీసు ఓకే చోట పూర్తి అయిన వారికి తప్పని సరిగా బదిలీ కానున్నట్లు వెల్లడించారు. బదిలీలకు అవకాశం కల్పించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
ap logo
Last Updated : Sep 8, 2021, 6:50 AM IST