ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఐఆర్​ఎస్ అధికారి కృష్ణ కిషోర్​పై కేసు నమోదు - ఐఆర్​ఎస్ అధికారి కృష్ణ కిషోర్​పై కేసు

ఇటీవలే సస్పెండ్ అయిన ఐఆర్​ఎస్ అధికారి కృష్ణ కిషోర్​పై సీఐడీ కేసు నమోదు చేసింది. ముందస్తు అనుమతి లేకుండా రూ.కోట్ల విలువైన ప్రకటనల జారీ, ఈడీబీలో ఉద్యోగాలు, ప్రజాధనం దుర్వినియోగం చేశారన్న అభియోగాలపై కేసు నమోదైంది.

irs officer krishna kishore
కృష్ణ కిషోర్

By

Published : Dec 16, 2019, 6:29 AM IST

రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి (ఏపీ ఈడీబీ) మాజీ సీఈఓ, ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిషోర్​పై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈడీబీలో ఉండగా నిధులు దుర్వినియోగం చేయటంతో పాటు ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా కోట్లాది రూపాయల విలువైన ప్రకటనలు జారీ చేశారన్న అభియోగంపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈడీబీలోని ప్రత్యేక గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ తులసీ రాణి చేసిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్లు 188, 120 బి, 409 ప్రకారం అభియోగాలు నమోదు చేశారు. ఏపీ ఈడీబీ- 2018 చట్టం ప్రకారం కూడా ఎఫ్ఐఆర్లో సీఐడీ అభియోగాలు మోపారు. ఈడీబీలోని మాజీ అకౌంట్స్ అధికారి బి. శ్రీనివాసరావుపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈడీబీలో ఉద్యోగాలు, ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ కేసు చేశారన్న అభియోగాలను ఇరువురిపైనా సీఐడీ మోపింది.

ABOUT THE AUTHOR

...view details