ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Cherry Tomato: చెర్రీ టొమాటో సాగు.. పోషక విలువలు బహుబాగు

Cherry tomato: చెర్రీ టొమాటో.. మన రోజువారీ ఆహారంలో వాడే టొమాటోలో ఇదో రకం. దీనినే తెలుగులో పసుపు చెర్రీ టొమాటో అని పిలుస్తారు. చూడటానికి చిన్నగా ఉంటాయి కానీ.. మంచి రుచి, పోషక విలువలు మాత్రం అధికంగా ఉంటాయి.

Cherry tomato are highly rich in proteins
Cherry tomato are highly rich in proteins

By

Published : May 8, 2022, 8:08 AM IST

Cherry tomato: మన రోజువారీ ఆహారంలో వాడే టొమాటోలో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో చెర్రీ టొమాటో ఒకటి. చూడటానికి చిన్నగా ఉండి ఎంతో రుచిగా ఉంటాయి. చెర్రీ టొమాటోలో పూసా చెర్రీ టొమాటో-1 తర్వాత భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ, న్యూఢిల్లీ మరొక చెర్రీ టొమాటో రకాన్ని అభివృద్ధి చేసింది. దాని పేరే పూసా గోల్డెన్‌ చెర్రీ టొమాటో-2. ఇది దేశీయ మొట్టమొదటి గోల్డెన్‌ చెర్రీ టొమాటో రకం. దీనినే తెలుగులో పసుపు చెర్రీ టొమాటో అని పిలుస్తారు. రకాన్ని తక్కువ ధర రక్షితగృహ సాగుకోసం రూపొందించారు.

వీటిని సలాడ్‌లలో ఎక్కువగా వాడతారు. ఇవి గుత్తులుగా కాస్తాయి. ప్రతి మొక్కకు 9 నుంచి 10 గుత్తులు ఉంటాయి. ఈ టొమాటోలు గుండ్రని, కోల ఆకారాలలో ఉంటాయి. పండ్ల పరిమాణం 2 నుంచి 15 గ్రా. మధ్యలో ఉంటుంది. పండ్లు వివిధ రంగుల్లో చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి. ఈ రకంలో పోషక విలువలు అధికంగా ఉంటాయి.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details