ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఇద్దరు చెంచులు మృతి - నాగర్​కర్నూల్​లోని అటవీ ప్రాంతంలో చెంచులు మృతి తాజావార్త

తెలంగాణ రాష్ట్రం నాగర్​కర్నూల్​ జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతంలో శనివారం తేనె తీయడానికి వెళ్లిన ముగ్గురు చెంచుల్లో ఇద్దరు మృతి చెందగా ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల కుటుంబాలను కలెక్టర్ శర్మాన్​ చౌహాన్​ పరామర్శించి.. వారిని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

chenchu-people-dead-at-nallamalla-forest-area-in-nagarkarnool-district
600 అడుగుల లోయలో పడిపోయారు

By

Published : Jul 19, 2020, 6:25 PM IST

తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతం అమ్రాబాద్ మండలం జంగంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆదివాసి చెంచులు తేనె తీయడానికి శనివారం మధ్యాహ్నం బయలుదేరి వెళ్లారు. కొండపై ప్రాంతంలో ఎక్కుతుండగా... ప్రమాదవశాత్తు తాడు తెగి ముగ్గురు చెంచులు సుమారు 600 అడుగుల లోయలో పడిపోయారు. దాసరి బయన్న(35), దాసరి పెద్దులు(28), అక్కడికక్కడే మృతి చెందగా.. వెంకటయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.

వారిని లోయలో నుంచి వెలికి తీయడానికి గ్రామస్థులు, స్థానికులు చాలా శ్రమించారు అయినా ఫలితం లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ శర్మాన్ హుటాహుటిన అమ్రాబాద్ పీహెచ్​సీకి వెళ్లారు. మృతదేహాలు తీసేందుకు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స అందిస్తామని వారి కుటుంబీకులకు హామీ ఇచ్చారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి వారికి తగు సహాయం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details