కరోనా వైరస్ కారణంగా కోళ్ల అమ్మకాలు భారీగా తగ్గిపోయి తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ పరిశ్రమ సుమారు రూ.2000 కోట్ల నష్టాలను చవిచూసింది. ఈ నేపథ్యంలో చికెన్ కొనేవారు లేకపోవటంతో తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని ఓ చికెన్ సెంటర్ యజమాని వినూత్న కార్యక్రమం చేపట్టాడు. కేవలం వంద రూపాయలకే రెండు కోళ్లు అమ్ముతున్నాడు. కోళ్లకు కరోనా వైరస్ ఉండదని ప్రజల్లో అవగాహన కల్పించడానికే కేవలం రూ.వందకే సుమారు 4 కిలోలున్న రెండు కోళ్లను అమ్ముతున్నామని దుకాణ యాజమాని తెలిపాడు. ఈ రకంగా చూస్తే.... ఒక కిలో కోడి మాంసం ఇంచుమించుగా రూ.25 కే వస్తోంది. ఈ ఆఫర్ విని కోళ్లను ఎగబడి కొనుక్కుంటున్నారు చికెన్ ప్రియులు.
బంపర్ ఆఫర్... రూ.100కే నాలుగు కిలోల చికెన్! - CORONA EFFECT
రావాలండీ... రావాలి... ఆలోచించిన ఆశాభంగం...కేవలం రూ.100కే రెండు కోళ్లు. ఈ బంపర్ ఆఫర్ ఈరోజు మాత్రమే...! ఇదంతా ఏంటీ అనుకుంటున్నారా? తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ చికెన్ దుకాణ యజమాని కరోనాపై చేపట్టిన అవగాహన కార్యక్రమం ఇది.
checken-shpo-owner-selling-live-chicken-with-lowest-price-at-chowtuppal