ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Changes in SSC Exams : ఈ ఏడాది నుంచి పదో తరగతి పరీక్షల్లో భారీ మార్పులు

Changes in Tenth Exams : పదో తరగతి పరీక్షల్లో తీసుకొచ్చిన భారీ మార్పులతో ఈ ఏడాది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. రెండేళ్ల కిత్రమే పరీక్షల్లో మార్పులు తీసుకొచ్చినా.. కరోనా వల్ల పబ్లిక్‌ పరీక్షలు జరగలేదు. దీంతో సంస్కరణల పరీక్షలను... ఈ ఏడాది విద్యార్థులు ఎదుర్కోబోతున్నారు. 2019-20 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షల్లో అంతర్గత మార్కులు, ప్రత్యేక బిట్‌ పేపర్‌ విధానాన్ని తొలగించారు. ప్రతి సబ్జెక్టులోనూ 100మార్కులకు ప్రశ్నలే ఉండేలా మార్పు చేశారు.

Changes in Tenth Exams
పదో తరగతి పరీక్షల్లో భారీ మార్పులు...

By

Published : Feb 24, 2022, 12:01 PM IST

పదో తరగతి పరీక్షల్లో భారీ మార్పులు...

Changes in Tenth Exams : పదో తరగతి పరీక్షల్లో తీసుకొచ్చిన భారీ మార్పులతో ఈ ఏడాది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. రెండేళ్ల కిత్రమే పరీక్షల్లో మార్పులు తీసుకొచ్చినా.. కరోనా వల్ల పబ్లిక్‌ పరీక్షలు జరగలేదు. దీంతో సంస్కరణల పరీక్షలను... ఈ ఏడాది విద్యార్థులు ఎదుర్కోబోతున్నారు. 2019-20 విద్యా సంవత్సరంలో పదోతరగతి పరీక్షల్లో అంతర్గత మార్కులు, ప్రత్యేక బిట్‌ పేపర్‌ విధానాన్ని తొలగించారు. ప్రతి సబ్జెక్టులోనూ 100మార్కులకు ప్రశ్నలే ఉండేలా మార్పు చేశారు.

కరోనా కారణంగా గత రెండేళ్లు పదో తరగతి పరీక్షలు జరగలేదు. గతేడాది కరోనా పేరుతో 11 పరీక్షలను ఏడుకు కుదించినా... పబ్లిక్‌ పరీక్షలు జరగలేదు. ఈ ఏడాది వీటికి అదనంగా పదిలో మార్కులను విధానాన్ని తీసుకొచ్చారు. దాదాపు పదేళ్లుగా ఉన్న గ్రేడ్ల విధానాన్ని తొలగించారు. పదో తరగతి పరీక్షల్లో ఇన్ని మార్పులు తీసుకొచ్చిన తర్వాత పరీక్షలు రాస్తున్న మొదటి బ్యాచ్‌ విద్యార్థులు... ఈ ఏడాది వారే. కరోనాతో విద్యా సంవత్సరం రెండు నెలలు ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో 30శాతం పాఠ్యప్రణాళిక తగ్గించారు. ఈ కారణాల వల్ల విద్యార్థులపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని ఉపాధ్యాయులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి :AP Budget: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఎప్పటినుంచి అంటే ?

New Changes in Tenth Exams : విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు 2012లో గ్రేడింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే... పోటీ పరీక్షలు, ఇతరత్రా ప్రవేశాలకు మార్కులు అవసరమని విద్యార్థుల నుంచి విజ్ఞప్తులు రావడంతో... గ్రేడ్ల విధానం తొలగించారు. పదో తరగతి విద్యార్థులకు, ఈ ఏడాది మార్కులు ఇవ్వనున్నారు. 600మార్కులకు జరిగే ఈ పరీక్షల్లో.. 360కిపైగా మార్కులు వస్తే మొదటి డివిజన్, 300 నుంచి 359 వరకు రెండో డివిజన్, 195 నుంచి 299 వరకు మూడో డివిజన్‌గా మెమోలో పేర్కొంటారు. ఇంతకంటే తక్కువ వస్తే ఎలాంటి డివిజన్‌ ఇవ్వరు. గతంలో 10మార్కుల వ్యత్యాసంలో ఒక్కటే గ్రేడ్‌ వచ్చేది.. ఇప్పుడు 360కి ఒక్క మార్కు తగ్గినా డివిజన్‌ మారిపోతుంది. కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించని 2019-20, 2020-21 బ్యాచ్‌ విద్యార్థులకు అంతర్గత మార్కులు ఆధారంగా మొదట గ్రేడ్లు, ఆ తర్వాత మార్కులు ఇచ్చారు. మార్కుల విధానంలో పరీక్ష రాసే వారు మాత్రం ఈ ఏడాది విద్యార్థులే.

సామాన్య శాస్త్రం మినహా మిగతా అన్ని సబ్జెక్టులను వంద మార్కులకు నిర్వహిస్తారు. ఏడు పరీక్షలు ఉంటాయి. అంతర్గత మార్కులు ఉండవు. ప్రత్యేకంగా బిట్‌ పేపర్‌ ఉండదు. ప్రశ్నపత్రంలోనే అబ్జెక్టివ్‌ తరహా, సంక్షిప్త, క్లుప్త, వ్యాసరూప ప్రశ్నలు ఇవ్వనున్నారు. జవాబు పత్రం ఒక్కటే ఉంటుంది. అందులోనే అన్నింటికీ సమాధానం రాయాల్సి ఉంటుంది. అదనంగా జవాబు పత్రాలు ఇవ్వరు. వంద మార్కుల పరీక్షకు 3 గంటల 15నిమిషాల సమయం ఉంటుంది. పరీక్షకు అదనంగా 15నిమిషాల సమయం ఉంటుంది. 10నిమిషాలు ప్రశ్నపత్రం చదువుకునేందుకు, మరో ఐదు నిమిషాలు చివరిలో జవాబులు సరి చూసుకునేందుకు ఇస్తారు.

ఇదీ చదవండి :

Ukraine crisis: ఏపీ విద్యార్థులను తీసుకొచ్చేందుకు సాయం చేయండి: విదేశాంగ మంత్రికి జగన్‌ లేఖ

ABOUT THE AUTHOR

...view details