పంట నష్టంపై సీఎం సమీక్షలో మంత్రులే అబద్ధాలు చెబుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు... తమకు జరిగిన నష్టంపై రైతులే సెల్ఫీ వీడియోలు తీసి పంపించటం వారి మనోవేదనకు సాక్ష్యాలని అన్నారు. రైతు పండించింది పుచ్చకాయ కాదు.. కర్బూజ అని, పత్రికలో వచ్చినవి పాత ఫొటోలని మంత్రి అబద్దాలు చెప్పడం గర్హనీయమన్నారు. పాలకుల అహంభావం ప్రజల ప్రాణాల మీదకు తెస్తోందని అభిప్రాయపడ్డారు.
పాలకుల అహంభావం ప్రజల ప్రాణాలకు చేటు: చంద్రబాబు - chandrababu video conference news
సీఎం సమీక్షలో మంత్రులే అబద్ధాలు చెబుతున్నారని చంద్రబాబు విమర్శించారు. రైతులే సెల్ఫీ వీడియోలు తీసి పంటనష్టం వివరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ట్రస్టు తరపున 2.5 లక్షల మాస్క్‌లు పంపిణీ చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. రైతుల్లో తెదేపా నేతలు ధైర్యం నింపాలని పిలుపునిచ్చారు.
chandrababu video conference
ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున రెండున్నర లక్షల మాస్క్‌లు పంపిణీ చేస్తామని, కరోనా వ్యాప్తి నివారణలో పాటుపడుతున్న సిబ్బందికి వాటిని అందజేయాలని చంద్రబాబు సూచించారు. తూర్పుగోదావరి మన్యంలో కాలువాపు వ్యాధితో ఆరుగురు మృతి చెందారని ఆ జిల్లా నేతలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి... స్పీకర్ తమ్మినేని సీతారాం బహిరంగ సభ నిర్వహించారని కూన రవికుమార్ తెలిపారు.