కరోనా వైరస్ రాష్ట్రంలో ప్రమాద ఘంటికలు మోగించే స్థాయికి చేరిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. యాక్టివ్ కేసుల సంఖ్యలో అగ్రభాగాన ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఐదోస్థానంలో నిలిచిందని వివరించారు. తొలిస్థానంలో మహారాష్ట్ర, రెండో స్థానంలో తమిళనాడు ఉన్నాయన్న తెలిపారు. రికవరీ శాతంలో అట్టడుగు నుంచి రెండోస్థానంలో ఉందని తెలిపారు.
రాష్ట్రంలో కరోనా ప్రమాద ఘంటికలు : చంద్రబాబు
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతుందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన చెందారు. యాక్టివ్ , రికవరీ కేసుల విషయంలో చాలా వ్యత్యాసం ఉందని ఆయన అన్నారు. యాక్టివ్ కేసుల్లో అగ్రభాగాన ఉన్న రాష్ట్రాల్లో ఐదో స్థానంలో ఉన్న ఏపీ... రికవరీ కేసుల్లో అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉందన్నారు. ఇందుకు సంబంధించి మ్యాప్‌లను ఆయన ట్విటర్లో పోస్టు చేశారు.
కోలుకున్న వారి శాతంలో అగ్రభాగన ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు నిలువగా... అట్టడుగు నుంచి మొదటిస్థానంలో కర్ణాటక, రెండుస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయని వివరించారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ దిగువన ఉండటం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఇందుకు సంబంధించిన మ్యాప్‌లను ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. నకిలీ ఎస్ఎమ్ఎస్లను ఆయన ప్రస్తావించారు. రాష్ట్రంలోని పరిస్థితులను గుర్తించి కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి :ప్రతిధ్వని: ఆన్లైన్ క్లాసులు.. అమెరికా ఆంక్షలు