ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

chandrababu:'రాష్ట్ర ప్రజలందరి ఆకాంక్ష అమరావతే' - చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్

chandrababu: అమరావతిని కాపాడుకోవాలన్న ఆకాంక్ష రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో బలంగా ఉందని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. రాజధాని రైతుల మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన సభకు విశేష ఆదరణ లభించడమే.. దానికి నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు.

చంద్రబాబు నాయుడు
చంద్రబాబు నాయుడు

By

Published : Dec 19, 2021, 9:44 AM IST

chandrababu: అమరావతిని కాపాడుకోవాలన్న ఆకాంక్ష రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో బలంగా ఉందని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. రాజధాని రైతుల మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన సభకు విశేష ఆదరణ లభించడమే.. దానికి నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ ముఖ్య నేతలతో ఆయన శనివారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తిరుపతి సభ విజయవంతం కావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో... అమరావతిని నాశనం చేయడం వల్ల.. రాష్ట్రానికి జరిగే నష్టాన్ని ప్రజలకు మరింతగా వివరించాలని.. పార్టీ నేతలకు సూచించారు.

పేద ప్రజల మెడకు ఓటీఎస్ ఉరితాడులా మారిందని.. దాన్ని వ్యతిరేకిస్తూ... సోమవారం అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్‌ కమిషనర్ల కార్యాలయాల ఎదుట తెలుగుదేశం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకూ ఒక్క ఇల్లూ కట్టలేదని తెలుగుదేశం హయాంలో నిర్మించిన ఇళ్లనూ లబ్ధిదారులకు ఇవ్వకుండా.. ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. గౌరవ సభల పేరుతో పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు మంచి స్పందన వస్తోందని తెలుగుదేశం నేతలు చంద్రబాబుకు తెలిపారు. పార్టీ నేతలంతా ఇకపై నిరంతరం క్షేత్రస్థాయి పర్యటనలతో ప్రజలకు అందుబాటులో ఉండాలని.... ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండగట్టాలని చంద్రబాబు సూచించారు.

ఇదీ చదవండి:

srisailam temple record assistant suspend: శ్రీశైల దేవస్థానం రికార్డు అసిస్టెంట్ పై.. సస్పెన్షన్ వేటు

ABOUT THE AUTHOR

...view details