ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'బీసీ నేతలు ఎదగడాన్ని జగన్‌ సహించలేకపోతున్నారు'

బీసీ నేతలు ఎదగడాన్ని జగన్‌ సహించలేకపోతున్నారని చంద్రబాబు ఆరోపించారు. అచ్చెన్నాయుడు, వాసుపల్లి గణేశ్‌పై వైకాపా దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. వైకాపా నేతల అసత్య ఆరోపణలను ప్రజలే తిప్పికొడతారని తెదేపా అధినేత స్పష్టం చేశారు.

chandrababu criticize ycp
చంద్రబాబు

By

Published : Feb 21, 2020, 9:10 PM IST

బీసీ నేతలపై వైకాపా దుష్ప్రచారాన్ని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. అచ్చెన్నాయుడు, వాసుపల్లి గణేశ్‌పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీసీ నేతలు ఎదగడాన్ని జగన్‌ సహించలేకపోతున్నారని ఆయన ఆరోపించారు. బలహీనవర్గాల గొంతు నొక్కేందుకే మండలి రద్దు తీర్మానం చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. బీసీలపై ద్వేషంతోనే ఆదరణ పథకాన్ని రద్దు చేశారని విమర్శించారు. కార్పొరేషన్ల నిధులన్నీ దారి మళ్లించి స్వాహా చేశారని మండిపడ్డారు. నిధుల గురించి ప్రశ్నించారనే బీసీ నేతలపై కక్ష కట్టారని అన్నారు. వైకాపా నేతల అసత్య ఆరోపణలను ప్రజలే తిప్పికొడతారని తెదేపా అధినేత స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details