ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శోభానాయుడు మృతికి చంద్రబాబు సంతాపం - chandrababu Condolence to Sobhanayudu

ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ శోభానాయుడు కన్నుమూశారు. ఆమె మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

chandrababu Condolence to Sobhanayudu
శోభానాయుడు మృతికి చంద్రబాబు సంతాపం

By

Published : Oct 14, 2020, 1:37 PM IST

శోభానాయుడు మృతి పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన నాట్యప్రతిభతో దేశ విదేశాల్లో భారతీయ కళల కీర్తిప్రతిష్టలను శోభానాయుడు పెంచారని కొనియాడారు. అంతర్జాతీయంగా కూచిపూడి నాట్యానికి పేరుప్రతిష్టలు ఇనుమడింప చేశారన్నారు. ఆమె సాధించిన అవార్డులు, రివార్డులే శోభానాయుడు కళా ప్రతిభకు తార్కాణాలుగా పేర్కొన్నారు.

శోభానాయుడు మృతితో తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డను కోల్పోయిందన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు చంద్రబాబు సంతాపం తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details