ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'హిడెన్ స్ప్రౌట్స్ పాఠశాల కూల్చివేతకు అనుమతించడం దారుణం' - chandra babu comments on ysrcp

విశాఖ నగరంలో విభిన్న ప్రతిభావంతులకు లాభాపేక్ష లేకుండా సేవ చేస్తున్న హిడెన్ స్ప్రౌట్స్ పాఠశాల కూల్చివేతకు.. అధికారులు అనుమతించటం దారుణమని తెదేపా అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోవటంతో పాటు.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్​కు లేఖ రాశారు.

chandra babu letter to cs
chandra babu letter to cs

By

Published : Jun 9, 2021, 11:47 AM IST

విశాఖలోని మానసిక వికలాంగుల పాఠశాల నిర్మాణాల తొలగింపుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్​కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. విభిన్న ప్రతిభావంతుల పాఠశాల నిర్మాణాల కూల్చివేత దారుణమని ఆయన ఆవేదన చెందారు.

లాభాపేక్ష లేకుండా విభిన్న ప్రతిభావంతుల కోసం హిడెన్ స్ప్రౌట్స్ పాఠశాల నిర్వహిస్తున్నారని తెలిపారు. పేద కుటుంబాలకు చెందిన 190 మంది సేవలు పొందుతున్నారని.. నష్టపోయిన బాధిత వర్గానికి ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని లేఖలో కోరారు. ల్యాండ్ మాఫియాతో అధికారులు చేతులు కలిపారని ఆరోపించిన చంద్రబాబు.. వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details