ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జైల్ భరోకు అమరావతి ఐకాస పిలుపు.. నేతల గృహ నిర్బంధాలు

రాజధాని పరిరక్షణ సమితి ఐకాస చలో గుంటూరు జైలుకు పిలుపునిచ్చింది. రైతులకు సంకెళ్లు వేయడంపై అమరావతి ఐకాస, తెదేపా ఆందోళన చేయాలని నిర్ణయించాయి. అయితే నేతలను రాజధాని ప్రాంతం నుంచి గుంటూరు వెళ్లకుండా పోలీసులు కట్టడి చేస్తున్నారు.

చలో గుంటూరు జైలు.. నేతల గృహ నిర్బంధాలు
చలో గుంటూరు జైలు.. నేతల గృహ నిర్బంధాలు

By

Published : Oct 31, 2020, 7:38 AM IST

Updated : Oct 31, 2020, 9:44 AM IST

రైతుల అరెస్టును నిరసిస్తూ తలపెట్టిన చలో గుంటూరు జైలు కార్యక్రమంలో భాగంగా రాజధాని ప్రాంతం నుంచి గుంటూరు వెళ్లకుండా నేతలను పోలీసులు కట్టడి చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే నాయకుల ఇళ్ల ముందు పోలీసుల మోహరించారు. ఐకాస నాయకులు, తెదేపా నేతలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. చిలకలూరిపేటలో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావును, గుంటూరులో తెదేపా నేత మన్నవ సుబ్బారావును గృహనిర్బంధం చేశారు.

చలో గుంటూరు జైలు.. నేతల గృహ నిర్బంధాలు

తుళ్లూరులో అమరావతి ఐకాస నేత కాటా అప్పారావు, ఎస్సీ ఐకాస నేత పులి చిన్నా ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. తుళ్లూరులో అమరావతి బహుజన ఐకాస కన్వీనర్ పోతుల బాలకోటయ్య, ఐకాస ఉపాధ్యక్షుడు వీరాంజనేయులు, కోకన్వీనర్‌ మనోజ్‌, మందడంలో మహిళా ఐకాస నేత ప్రియాంకను గృహనిర్బంధం చేశారు.

రాజధాని రైతులను భేషరతుగా విడుదల చేయాలి: సీపీఐ రామకృష్ణ

అమరావతి రైతులను భేషరతుగా విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. రైతులు, మహిళలపై పెట్టిన మొత్తం కేసులను ఉపసంహరించుకోవాలని.... సీఎం మొండివైఖరి వీడి అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ ప్రకటన చేయాలన్నారు.

ఇదీ చదవండి:

పోలవరం నిధుల్లో మరింత కోత?

Last Updated : Oct 31, 2020, 9:44 AM IST

ABOUT THE AUTHOR

...view details