ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై ఈసీ కసరత్తు

రాష్ట్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై... కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. దీనికి సంబంధించి వివిధ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ సమావేశం నిర్వహించి... చర్చించారు.

teachers MLC elections
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్

By

Published : Feb 12, 2021, 8:03 PM IST

ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై... ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. కృష్ణా-గుంటూరు, తూర్పు గోదావరి-పశ్ఛిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై వివిధ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైకాపా, తెదేపా, సీపీఎం, సీపీఐ ప్రతినిధులు హాజరయ్యారు. పార్టీల ప్రతినిధులకు ఓటర్ల జాబితాలను సీఈవో అందజేశారు.

తూర్పు గోదావరి- పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 17, 285 మంది ఓటర్లు నమోదయ్యారు. పోలింగ్ నిర్వహణకు 116 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 13, 121 మంది ఓటర్లు నమోదు కాగా... 110 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. రేపటితో ఓటర్ల నమోదుకు చివరి తేదీ అని పార్టీలకు సీఈవో విజయానంద్ తెలిపారు. ఆన్​లైన్ ద్వారా ఎవరైనా ఓట్లు నమోదు చేసుకుంటే.. సప్లిమెంటరీ ఓటర్ల జాబితాలను సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details