నర్సీపట్నం, గొలుగొండ మండలం, ఏటిగైరంపేట రామాలయం ఘటనలో గుడి ఎదురుగా కిరాణా షాపు నడుపుకుంటూ, భక్తితో ఆలయ నిర్వహణ చూస్తున్న ఆర్యవైశ్యులు 69 ఏళ్ళ పోలిశెట్టి కనకరాజు, పోలిశెట్టి సంతోష్‌లను పోలీసు స్టేషనులో నిర్బంధించి హింసించడం దారుణమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. ఆఖరికి ఆలయ పూజారి పేరును కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడం హేయమైన చర్య అని మండిపడ్డారు.
'అమాయకులను కేసుల్లో ఇరికించి... హింసించవద్దు' - chandrababu latest news
ఆలయ పూజారి పేరును సైతం ఎఫ్‌ఐఆర్‌లో చేర్చటం హేయమైన చర్య అని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఆలయ నిర్వహణ చూస్తున్న ఆర్యవైశ్యులను నిర్బంధించటం దారుణమన్నారు.
వైకాపా పాలనలో సుమారు 140 ఆలయాలపై ఇన్ని నెలలుగా దాడులు జరుగుతున్నా దోషులను పట్టుకోవడం చేతకాని వాళ్ళు.. ఇప్పుడు ఇలా అమాయకులను, వృద్ధులను వారాంతపు సెలవులు అని తెలిసి కూడా స్టేషన్లో పెట్టి వేధిస్తున్నారంటే అసలు వీళ్ళు మనుషులేనా అని నిలదీశారు. పైగా వాళ్ళ మీద తెలుగుదేశం కార్యకర్తలు అని ముద్ర వేసి విషప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇదే ఘటనతో సంబంధముందని చెబుతున్న మరో వ్యక్తి వైకాపా నాయకులతో ఉన్న ఫోటోలు బయటపడ్డాయని తెలిపారు. అలాంటప్పుడు అతనిచేత వైకాపా నేతలే కావాలని ఇదంతా చేయిస్తున్నారని తాము కూడా అనాలా అని ప్రశ్నించారు. చేతనైతే దేవాలయాలపై దాడుల్ని ఆపాలన్న చంద్రబాబు.. అంతేకాని ఇలా అమాయకులను కేసుల్లో ఇరికించి హింసించవద్దన్నారు. ఇది క్షమించరాని మహాపాపమన్నారు. ఘటనకు సంబంధించిన ఓ వీడియోను చంద్రబాబు ట్విట్టర్‌కు జత చేశారు.
ఇదీ చదవండి:'ఆ విషయంలో మెుదటగా సీఎం జగన్ పైనే కేసు పెట్టాలి'