ప్రజల డబ్బుతో వాలంటీర్లను నియమించుకున్నది వైకాపా నేతలకు వంగివంగి దండాలు పెట్టడానికా అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిలదీశారు. వాలంటీర్లున్నది ప్రజల కోసమా... పార్టీకోసమా అని ప్రశ్నించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడానికే వాలంటీర్ల వ్యవస్థను పెట్టారన్న చంద్రబాబు... ప్రజాధనంతోనే వాళ్ళకి జీతాలు ఇస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కరోనా సాయం కింద ఇచ్చే వెయ్యి రూపాయలను వైకాపా నేతలు ఇస్తాననడం ఏంటని నిలదీశారు. కాదన్న వాలంటీర్లను విధుల నుంచి తొలగించడం సరైన చర్య కాదని హితవు పలికారు.
వాలంటీర్లు ప్రజల కోసమా.. ప్రభుత్వం కోసమా?: చంద్రబాబు
ప్రజల డబ్బుతో వాలంటీర్లను నియమించుకున్నది వైకాపా నేతలకు వంగివంగి దండాలు పెట్టడానికా అని చంద్రబాబు నిలదీశారు. కరోనా సాయం కింద ఇచ్చే వెయ్యి రూపాయలను వైకాపా నేతలు ఇస్తాననడం ఏంటని మండిపడ్డారు.
cbn-comments-on-ycp-mlas
విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం గెడ్డతిరువాడకు చెందిన బొంగు కార్తీక్, గోపిశెట్టి ఝాన్సీలను వైకాపా నేతల మాట వినలేదని విధుల్లోంచి తొలగించారని మండిపడ్డారు. ఝాన్సీ ఆత్మహత్యాయత్నం చేసిందన్న చంద్రబాబు...వాలంటీర్లపై వేధింపులు ఏంటని ఆక్షేపించారు.
ఇవీ చదవండి:షాపులు తెరవడంపై హోంశాఖ కొత్త రూల్స్ ఇవే...