జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో ఇందూ టెక్ జోన్ కేసులో నిందితుడిగా ఉన్న ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యను కేసు నుంచి తొలగించరాదంటూ డిశ్ఛార్జి పిటిషన్‌లో సీబీఐ గురువారం కౌంటరు దాఖలు చేసింది. ‘అప్పట్లో ఏపీఐఐసీ వీసీ, ఎండీగా ఉన్న బీపీ ఆచార్య ఇందూ టెక్‌కు సెజ్ అప్పగింత ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు. అర్హతలు లేకపోయినా ఇందూ టెక్‌కు ప్రాజెక్టును అప్పగించారు. ఇందుకు అధికారులను ప్రభావితం చేశారు. కేసు ప్రాథమిక దశలో ఉన్నందున అభియోగాల నమోదు దశలోనే కేసు నుంచి ఆచార్యను తొలగించవద్దు. డిశ్ఛార్జి పిటిషన్‌ను కొట్టివేయండ’ని సీబీఐ పేర్కొంది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ‘భూమి రియల్ ఎస్టేట్స్ ఇన్వెస్ట్‌మెంట్’ డిశ్ఛార్జి పిటిషన్‌లోనూ సీబీఐ కౌంటరు దాఖలు చేసింది. ఇందూ టెక్ ప్రాజెక్టుకు కేటాయించిన స్థలాన్ని భూమి రియల్ ఎస్టేట్‌కు అప్పగించారని పేర్కొంది. ఇందూ టెక్ జోన్ కేసును 14కు, రఘురాం/ భారతీ సిమెంట్స్ కేసును ఈనెల 15వ తేదీకి వాయిదా వేసింది.
బీపీ ఆచార్యను కేసు నుంచి తొలగించొద్దు: సీబీఐ
జగన్ అక్రమాస్తుల కేసులో ఇందూ టెక్‌జోన్ ఛార్జిషీట్ నుంచి విశ్రాంత ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యను తొలగించవద్దని సీబీఐ కోరింది. ఏపీఐఐసీ అప్పటి ఎండీగా బీపీ ఆచార్య కీలక పాత్ర పోషించారని... ఆయన ప్రమేయంపై స్పష్టమైన ఆధారాలున్నాయని కోర్టుకు తెలిపింది. ఈ దశలో కేసు నుంచి ఆచార్యను తొలగించవద్దని... డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేయాలని కోరుతూ సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది.
సీబీఐ