ap corona cases: రాష్ట్రంలో భారీగా తగ్గిన కరోనా కేసులు - ఏపీ లో కరోనా
16:48 June 07
corona cases
రాష్ట్రంలో కరోనా కేసులు(corona cases) భారీగా తగ్గాయి. కొత్తగా 4,872 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. గడిచిన 24 గంటల్లో 64,800 శాంపిల్స్ పరీక్షించగా, 4,872 మంది కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 1.98కోట్ల శాంపిల్స్‌ను పరీక్షించారు. తాజాగా 13,702మంది కరోనా నుంచి కోలుకుని బయటపడ్డారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 1,14,510 యాక్టివ్ కరోనా కేసులు ఉండగా, గడిచిన 24 గంటల్లో కరోనాతో పోరాడుతూ 86మంది మృత్యువాతపడ్డారు. అత్యధికంగా చిత్తూరులో 13మంది చనిపోగా, గుంటూరు 10, అనంతపురం 9, శ్రీకాకుళం 9, విజయనగరం 7, పశ్చిమగోదావరి 7, ప్రకాశం 6, విశాఖపట్నం 6, తూర్పుగోదావరి 5, కృష్ణా 5, కర్నూలు 5, నెల్లూరులో నలుగురు మరణించారు. ఇప్పటివరకూ కరోనాతో 11,552మంది మృతి చెందారు.
ఇదీ చదవండి: