ఓటమి అనుకోకుండా..ఒకటీరెండు సార్లు దరఖాస్తు తిరస్కరణకు గురయినంత మాత్రాన అది పూర్తిగా మీ వైఫల్యం అనుకోకూడదు. ఈ మాత్రం దానికే కుంగిపోవడం, మరోచోట అప్లై చేయడానికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రయత్నిస్తూనే ఉండాలి. దీన్ని ఓటమిగా భావించకుండా, ఎలాగైనా సాధించడానికి కృషి చేస్తూనే ఉండాలి. వైఫల్యంతోపాటే విజయం కూడా ఉంటుందని గుర్తిస్తే చాలు. ప్రయత్నం చేయడం దానంతటదే అలవడుతుంది.
నైపుణ్యాలు.. ఏ సంస్థకు మీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో, దానికి సంబంధించిన పూర్తి అధ్యయనం చేయాలి. ఆ సంస్థ అభివృద్ధి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అంతే కాదు, అప్లై చేస్తున్న ఉద్యోగానికి ఎటువంటి నైపుణ్యాలు అవసరమో గుర్తించి, వాటిలో శిక్షణ తీసుకుంటే మంచిది. ఇప్పుడు చాలా కోర్సులను ఆన్‌లైన్‌లోనే చేయవచ్చు. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే, విజయం మీదే.