ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా భయం: జేసీబీతో యువకుడి మృతదేహం ఖననం - రామపురంలో జేసీబీతో యువకుడి మృతదేహం ఖననం

కరోనా కరోనా ఏంచేస్తావ్ అంటే మానవ సంబంధాలు తుంచేస్తాను అనే విధంగా మారింది ప్రస్తుత పరిస్థితి. కరోనా ఉందో.. లేదో తెలియకుండా.. వైరస్‌ భయంతో మృతదేహాన్ని జేసీబీలో తీసుకెళ్లి ఖననం చేసిన సంఘటన తెలంగాణ జోగులాంబ జిల్లాలో చోటుచేసుకుంది.

Burial of young man's body with JCB
సీబీతో యువకుడి మృతదేహం ఖననం

By

Published : Jul 23, 2020, 8:48 AM IST

తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన యువకులు తిరుపతికి వెళ్లి వచ్చారు. ఇందులో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. మిగతా వారికి లక్షణాలు లేకపోవడం వల్ల వైద్య సిబ్బంది ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదు. హఠాత్తుగా వారిలో ఒక యువకుడు మృతి చెందాడు. దీంతో కరోనాతోనే చనిపోయాడన్న భయంతో జేసీబీ సహాయంతో ఆ మృతదేహాన్ని ఖననం చేశారు.

అయితే వైరస్‌ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఆరోగ్యంగానే ఉన్నాడు. మృతి చెందిన వ్యక్తికి కూడా వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించి ఉంటే జాగ్రత్తలు తీసుకునే వాడు కదా అని స్థానికులు ఆరోపిస్తున్నారు. కరోనా భయంతో జేసీబీ సాయంతో ఖననం చేసుకునే పరిస్థితి వచ్చిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:గుడ్​న్యూస్​: అక్టోబరు కల్లా ఆక్స్​ఫర్డ్‌ టీకా

ABOUT THE AUTHOR

...view details