రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు, రాజధాని అంశాలపై... ప్రభుత్వం నియమించిన అధ్యయన కమిటీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో సమావేశమైంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కమిటీ కన్వీనర్ జీఎన్ రావు, కార్యదర్శి విజయ్ మోహన్ సహా... సభ్యులు డాక్టర్ అంజలిమోహన్, కె.టి.రవీంద్రన్, డాక్టర్ మహావీర్, డాక్టర్ సుబ్బారావు... సీఎం జగన్ను కలిశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ తాము సందర్శించిన ప్రాంతాలు, అధ్యయనం చేసిన అంశాలను కమిటీ సభ్యులు సీఎంకు వివరించారు. తాము అధ్యయనం చేసిన అంశాలను, తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి నివేదికను త్వరలోనే సమర్పిస్తామని జీఎన్ రావు కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి తెలిపారు.