ఆంధ్రప్రదేశ్

andhra pradesh

న్యూయార్క్ వెళ్లేందుకు ఎంపీ సుజనాకు హైకోర్టు అనుమతి

భాజపా ఎంపీ సుజనా చౌదరి...లుక్ అవుట్ నోటీసులను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నోటీసులను రద్దు చేయాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. అయితే రెండు వారాలు న్యూయార్క్ వెళ్లేందుకు సుజనాచౌదరికి తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. సీబీఐకి వివరాలు తెలిపి వెళ్లి రావాలని స్పష్టం చేసింది.

By

Published : Nov 13, 2020, 5:55 PM IST

Published : Nov 13, 2020, 5:55 PM IST

ETV Bharat / city

న్యూయార్క్ వెళ్లేందుకు ఎంపీ సుజనాకు హైకోర్టు అనుమతి

Bjp mp sujana chowdary
Bjp mp sujana chowdary

లుక్‌ అవుట్ నోటీసులను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో ఎంపీ సుజనా చౌదరి పిటిషన్ దాఖలు చేశారు. లుక్‌అవుట్ నోటీసులు రద్దు చేసేలా ఆదేశించాలని కోర్టును కోరారు. పిటిషన్​లో ఇమ్మిగ్రేషన్ బ్యూరో, సీబీఐ, ఈడీ, హోంశాఖను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్​ తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణకు రానుంది.

ఈనెల 15న న్యూయార్క్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సుజనా చౌదరి కోర్టును కోరగా...అందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. రెండు వారాల పర్యటన వివరాలు సీబీఐకి తెలిపి వెళ్లి రావాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

ABOUT THE AUTHOR

...view details