లోక్ సభ ఉపఎన్నికలో భాజపా - జనసేన కూటమి ఎంపీ అభ్యర్థి రత్నప్రభను గెలిపించాలని కోరుతూ తిరుపతిలో ఇరు పార్టీల నాయకులు ఉమ్మడిగా ప్రచారం నిర్వహించారు. అన్నారావు సర్కిల్ నుంచి కపిలతీర్థం వరకూ సాగిన ర్యాలీలో ఎంపీ అభ్యర్థి రత్నప్రభ, ఎంపీ టీజీ వెంకటేష్, తెలంగాణ భాజపా నేత, ఎమ్మెల్యే రఘునందన్ రావు, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.
జనసేన తరపున పసుపులేటి హరిప్రసాద్.. కూటమి అభ్యర్థి రత్నప్రభకు ఓటు వేయ్యాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రఘునందన్ రావు.. దుబ్బాక ఫలితాన్ని తిరుపతిలోనూ పునరావృతం చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రాంతీయ పార్టీలు ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా విస్మరించాయన్న రఘునందన్.. దుబ్బాక ఎన్నికలో వైకాపా తరహాలోనే తెరాస మెజార్టీ గురించి సవాళ్లు విసిరి భంగపడిందని గుర్తు చేశారు.