ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొవాగ్జిన్ టీకాను అన్నిదేశాలకు అందిస్తాం: భారత్‌ బయోటెక్‌

కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతించడంపై భారత్ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల హర్షం వ్యక్తం చేశారు. తాము తయారు చేసిన వ్యాక్సిన్​ సురక్షితమైనదని.. వైరల్ ప్రోటీన్లను తట్టుకునేలా కొవాగ్జిన్​ను తయారుచేసినట్టు ఆయన తెలిపారు.

bharat biotech on corona vaccine
టీకా పనితీరుపై భారత్​ బయోటెక్​

By

Published : Jan 3, 2021, 8:56 PM IST

కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఆమోదంపై భారత్ బయోటెక్ హర్షం వ్యక్తం చేసింది. డీసీజీఐ అనుమతి కొత్త ఉత్పత్తుల అభివృద్ధికి ఊతమిస్తుందని భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల తెలిపారు. కొవాగ్జిన్‌కు డీసీజీఐ అనుమతి.. దేశం గర్వించదగ్గ విషయమని చెప్పారు. వైరల్ ప్రోటీన్లను తట్టుకునేలా కొవాగ్జిన్ రూపొందించామని వెల్లడించారు.

బలమైన రోగనిరోధక ప్రతిస్పందనలను కొవాగ్జిన్ ఉత్పత్తి చేసింది. ఇప్పటివరకు మేం చేసిన వాటిలో కొవాగ్జిన్‌ ప్రయోగమే అతి పెద్దది. దేశంలో మానవులపై జరిగిన టీకా ప్రయోగాల్లో మాదే అతిపెద్ద ప్రయోగం. మూడో దశ ప్రయోగాలు గతేడాది నవంబర్‌లో ప్రారంభించాం. మూడో దశ ప్రయోగాల కోసం 23వేల మంది వాలంటీర్లను తీసుకున్నాం. వాలంటీర్ల స్ఫూర్తి భారత్‌కు, ప్రపంచానికి గొప్ప నైతిక బలాన్ని ఇస్తుంది. కొవాగ్జిన్ టీకాను అన్నిదేశాలకు అందించడమే మా లక్ష్యం.

కృష్ణ ఎల్ల, భారత్ బయోటెక్‌ సీఎండీ

ఇదీ చదవండి:కొవాగ్జిన్​కు డీసీజీఐ గ్రీన్​సిగ్నల్.. త్వరలోనే పంపిణీ

ABOUT THE AUTHOR

...view details