ఎండ ప్రభావంతో శరీరం నిస్సత్తువగా మారినప్పుడు తాజా చెరుకు రసాన్ని తీసుకుంటే తక్షణ శక్తి అందుతుంది. గ్లూకోజును విడుదల చేసి, వెంటనే రక్తంలో తగ్గిపోయిన చక్కెర స్థాయులను పెరిగేలా చేస్తుంది. డీహైడ్రేషన్‌కు గురికాకుండా శరీరాన్ని కాపాడుతుంది.
మూత్రాశయ సమస్యలకు దూరంగా...
ముప్పావు గ్లాసు చెరుకురసంలో చెంచా చొప్పున నిమ్మరసం, అల్లం రసం, ముప్పావుకప్పు కొబ్బరి నీళ్లను కలిపి తాగితే మూత్రాశయ పనితీరు మెరుగుపడుతుంది. ఇది వ్యర్థాలను బయటికి పంపడమే కాకుండా, మూత్రనాళాల్లో ఇన్ఫెక్షన్లు రానివ్వదు.
దంత సమస్యలను పోగొట్టి...
చెరుకురసంలో కాల్షియం, ఫాస్పరస్‌వంటి ఖనిజాలు ఎనామిల్‌ను రక్షిస్తూ, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. పోషకాహారలేమి, దంతాల అనారోగ్యం వల్ల వచ్చే నోటి దుర్వాసనను చెరుకు రసం దూరం చేస్తుంది.
జీర్ణశక్తిని మెరుగుపరిచి...
పొటాషియంతోపాటు ఈ రసంలో ఉండే పీచు జీర్ణాశయ పనితీరును మెరుగుపరుస్తుంది. అజీర్తి వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.