గత ప్రభుత్వం 3.19 లక్షల గృహ నిర్మాణాలను చేపట్టగా వైకాపా అధికారం చేపట్టగానే 51వేల ఇళ్లను రద్దు చేసింది. మిగతా 2.62 లక్షల ఇళ్లను మూడు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందుకు రూ.13వేల కోట్లు అవసరమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. లబ్ధిదారుల తరఫున బ్యాంకులు ఇవ్వాల్సిన రూ.4వేల కోట్ల రుణం, వివిధ ఆర్థిక సంస్థల నుంచి మరో రూ.6వేల కోట్లు వడ్డీకి తెచ్చి పెండింగ్ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులకు స్పష్టం చేసింది. ఆ మేరకు రూ.6వేల కోట్లను 8-10% వడ్డీతో సేకరించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. హడ్కో, నేషనల్ హౌసింగ్ బ్యాంకు (ఎన్‌హెచ్‌బీ), మరో 3 వాణిజ్య బ్యాంకులను సంప్రదించారు. హడ్కో, ఎన్‌హెచ్‌బీ రుణ మంజూరుకు కొర్రీలు పెడుతుండగా.. అవి ఇస్తేనే మేం ఇస్తామంటూ వాణిజ్య బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇన్నాళ్లు టిడ్కో ఇళ్లపై నెలకొన్న సందిగ్ధత వల్ల అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు ఆలోచిస్తున్నాయని తెలుస్తోంది.
వెయ్యి కోట్లు సమకూరినా 85వేల ఇళ్లు ఇచ్చేయొచ్చు
మొదటి విడతలోని 85,888 ఇళ్లలో 90% గృహాలు గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. 24 ప్రాంతాల్లోని గృహ సముదాయాల్లో నీటి శుద్ధి ప్లాంటు (ఎస్‌టీపీ), చిన్న చిన్న పనులనే పూర్తి చేయాలి. ఎస్‌టీపీల నిర్మాణానికి రూ.196 కోట్లు, మిగిలిన సదుపాయాల కల్పనకు రూ.320 కోట్లు అవసరమని ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. వీటితోపాటు పెండింగ్ బిల్లులు, ఇతరత్రా కలిపి రూ.1000 కోట్లు సమకూరితే 85,888 వేల ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చేయొచ్చు.
రూ.400 కోట్లు లబ్ధిదారులకే ఇవ్వాలి