మైనర్ బాలికతో వ్యభిచారం (Minor Girl Prostitution) చేయిస్తున్న భార్యాభర్తలతో పాటు ఓ విటుడిని బాలాపూర్ పోలీసులు (Balapur Police) అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాయల్ కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం (Prostitution) జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. ఏహెచ్‌టీయూ, పోలీసులు సంయుక్తంగా ఆ ఇంటిపై దాడులు నిర్వహించారు.
వ్యభిచార కూపం నుంచి బిహార్ రాష్ట్రానికి చెందిన 17 సంవత్సరాల మైనర్ బాలికకు (minor girl rescued) విముక్తి కలిగించారు. వ్యభిచార ముఠాలోని ముగ్గురు నిర్వాహకుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. వీరితో పాటు ఓ విటుడిని అదుపులోకి తీసుకున్న బాలాపూర్ పోలీసులు... రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.2,420 నగదుతో పాటు మూడు సెల్ఫోన్లు, 6 కండోమ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
పనిపేరుతో కూపంలో దించి...
బాలాపూర్ రాయల్ కాలనీకి చెందిన రెహానా బేగం, సయ్యద్ అబూబకర్ భార్యభర్తలు. తక్కువ సమయంలో సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో రెహానా బేగం, సయ్యద్ అబూబాకర్ తన స్నేహితురాలు సల్మాబేగంతో కలిసి వ్యభిచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం చాంద్రాయణగుట్ట నుంచి రాయల్ కాలనీకి రెహానా బేగం మకాం మార్చింది. చాంద్రాయణగుట్టలో ఉంటున్న సమయంలో పక్కింటికి చెందిన 17 సంవత్సరాల బాలిక ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పించాలంటూ రెహానాబేగంను కోరింది.
సగం... సగం...
ఇదే అదనుగా భావించి.. ఆ మైనర్‌బాలికకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి (Minor Girl Prostitution) దింపింది. ఆ తర్వాత రెహానాబేగం.. ఒక్కొక్క విటుడి నుంచి రూ. 2వేలు వసూలు చేస్తూ వాటిలో సగం డబ్బులు బాలికకు ఇస్తూ వస్తోంది. వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు ఈ ప్రాంతంలో రెక్కి నిర్వహించారు. అనంతరం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని వ్యభిచార ముఠా గుట్టురట్టు చేశారు.
మైనర్ బాలికను అదుపులోకి తీసుకుని రెస్క్యూ హోంకు తరలించారు. వ్యభిచారం నిర్వహిస్తున్న రెహానా బేగం, సయ్యద్ అబూబకర్ అరెస్ట్ అవ్వగా మరొకరు పరారీలో ఉన్నారు. ఓ విటుడు పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి: