ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దొంగ ఓట్లు వేయించి, తెదేపాపై ఎదురుదాడి చేస్తారా?: అచ్చెన్నాయుడు

వైకాపా నేతలపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించి, తమపై ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకన్న సాక్షిగా దొంగఓట్లు వేయించలేదని ప్రమాణం చేయటానికి సిద్ధమా అని సవాల్ విసిరారు.

atchannaidu
atchannaidu fires on election election commission

By

Published : Apr 19, 2021, 12:35 PM IST

అచ్చెన్నాయుడు

వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించి, తమపై ఎదురుదాడి చేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు..అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ ఉపఎన్నికల్లో వైకాపా దిగజారుడు రాజకీయాలకు తెరలేపిందన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా దొంగఓట్లు వేయించలేదని ప్రమాణం చేయటానికి సిద్ధమా అని వైకాపాకు సవాల్‌ విసిరారు.

ఎన్నికల సంఘం ప్రేక్షకపాత్ర వహించడం దారుణం. దొంగ నోట్ల ముద్రణ ఎంత తప్పో అందరికీ తెలుసు. దొంగ ఓట్లపై ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలి. ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండాపోయింది. ఒక్క దొంగ ఓటు కూడా పడలేదని వెంకన్న సాక్షిగా ప్రమాణం చేస్తారా..? దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే స్పందించాలి. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక రద్దుచేస్తున్నామని సీఈసీ ప్రకటించాలి- అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details