ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RTC: కోలుకుంటున్న ఆర్టీసీ.. పెరుగుతున్న రోజువారీ ఆదాయం

కరోనా దెబ్బకు కుదేలైన ఆర్టీసీ క్రమంగా కోలుకుంటుంది. గతంతో పోల్చితే.. రోజువారి ఆదాయం పెరుగుతోంది. త్వరలో విద్యాసంస్థలు తెరిస్తే రాబడీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

rtc
rtc

By

Published : Aug 27, 2021, 8:23 AM IST

కరోనా కారణంగా ఏపీఎస్‌ఆర్టీసీకి ఇప్పటివరకూ రూ.3,500 కోట్ల నష్టం వాటిల్లింది. గత ఏడాది మార్చి 24 నుంచి లాక్‌డౌన్‌తో 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2,300 కోట్లు నష్టపోయింది. కరోనా రెండో ఉద్ధృతిలో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జులై వరకు రూ.1,200 కోట్లు నష్టం వచ్చినట్లు లెక్క తేల్చారు. ఎక్కువగా విజయవాడ, తిరుపతి, విశాఖ, గుంటూరు తదితర రీజియన్లలో నష్టాలొచ్చాయి.

ప్రసుత్తం సగటున రూ.11 కోట్ల వరకు నిత్యం రాబడి ఉంటోంది. గతేదాడి ఈ సమయానికి ఇందులో సగం కూడా లేదు. ఓఆర్‌ 9% పెరిగి 60శాతానికి చేరింది. శ్రావణ మాసం కావడంతో రాబడి పెరిగిందని, విద్యాసంస్థలు తెరుస్తున్నందున త్వరలో లక్ష్యం మేరకు రోజువారీ రాబడి సగటున రూ.14.5 కోట్లు వచ్చే వీలుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details