ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆపద కాలంలో ఆర్టీసీ బస్సుల సరికొత్త సేవ - covid tests in apsrtc buses news

సురక్షిత ప్రజా రవాణాకు చిరునామా అయిన ఆర్టీసీ బస్సులు ఆపద కాలంలో సరికొత్త బాధ్యతలు స్వీకరిస్తున్నాయి. కొవిడ్‌ పరీక్షా కేంద్రాలుగా మారి, ప్రజా ఆరోగ్యానికి కాపు కాసేందుకు సిద్ధమవుతున్నాయి. కరోనాపై పోరాటంలో మేము సైతం అంటూ కీలక విధుల్లో భాగం పంచుకొంటున్నాయి.

apsrtc
apsrtc

By

Published : Jun 11, 2020, 4:04 AM IST


కరోనా పరీక్షా కేంద్రాలుగా ప్రజలకు సరికొత్త సేవలు అందించేందుకు ఆర్టీసీ ఏసీ బస్సులు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం సాధారణ బస్సులు రహదారులపైకి వచ్చినా... ఒకప్పుడు విపరీతమైన డిమాండ్ కలిగిన ఏసీ బస్సులు మాత్రం కరోనా వ్యాప్తి భయంతో డిపోలకే పరిమితమయ్యాయి. మరోవైపు... కరోనా మహమ్మారి విస్తరిస్తున్నందున రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ టెస్టింగ్ వాహనాలు సిద్ధం చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో డిపోల్లోని ఏసీ బస్సులనే సద్వినియోగం చేసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో విజయవాడలోని ఓ ఇంద్ర బస్సును ప్రయోగాత్మకంగా సిద్ధం చేశారు.

కరోనా పరీక్షల నిర్వహణకు వీలుగా బస్సు లోపలి భాగంలో రూపురేఖలు పూర్తిగా మార్చేశారు. ఒక బస్సులో ఏకకాలంలో 10మంది అనుమానితులకు పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఆయా బస్సుల్లో వైద్యులు, సహాయక సిబ్బంది తగిన పరికరాలతో సహా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు తరలి వెళ్లి.... అనుమానిత ప్రాంతాల్లో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 52 ఏసీ బస్సులను ఆర్టీసీ అధికారులు ఈ విధంగా తీర్చిదిద్ది వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించనున్నారు. జిల్లాకు కొన్ని బస్సుల చొప్పున మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లి అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించనున్నారు. బస్సుల రూపురేఖలను మార్చే బాధ్యతను అంబా బస్ బిల్డర్స్ అనే సంస్థకు అప్పగించారు.

కరోనా ప్రభావం కొనసాగినన్ని రోజులూ ఈ బస్సులు ఇలా పరీక్షా కేంద్రాలుగా సేవలందించే అవకాశాలున్నాయి. సాధారణ పరిస్థితులు నెలకొన్నాక తిరిగి యథారూపం సంతరించుకోనున్నాయి.

ఇదీ చదవండి:

ఒంగోలు కుర్రోడు.. ఊళ్లోనే కంపెనీ పెట్టేశాడు!


ఆరోగ్యసేవ

ABOUT THE AUTHOR

...view details