APPSC Job Notifications: 730 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల - ఏపీ వార్తలు
20:13 December 28
నోటిఫికేషన్ల పూర్తి వివరాలు ఏపీపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో లభ్యం
APPSC Job Notifications: రెవెన్యూ, దేవాదాయ విభాగాల్లో జూనియర్ సహాయకుడు, కంప్యూటర్ సహాయకుడు, కార్యనిర్వాహక అధికారి గ్రేడ్-3 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. ఈనెల 30 నుంచి జనవరి 19వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. ఫీజు చెల్లింపునకు జనవరి 18 అర్ధరాత్రి వరకు గడువు విధించింది. రెవెన్యూ విభాగంలో జూనియర్ సహాయకులు, కంప్యూటర్ సహాయకుల పోస్టులు 670 ఉన్నాయి. దేవాదాయశాఖలో కార్యనిర్వాహక అధికారి గ్రేడ్-3 పోస్టులు 60 ఉన్నాయి. అభ్యర్థులు ఒకేసారి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (ఓటీపీఆర్) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలి. కొత్త అభ్యర్థులు ఓటీపీఆర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష రాసేందుకు అభ్యర్థులు తెలుగు, ఆంగ్లం ఏ భాషనైనా ఎంపిక చేసుకోవచ్చు.
ఇదీ చదవండి:
Prakash javadekar on YSRCP: బెయిల్‌పై ఉన్న నేతలు ఎప్పుడైనా జైలుకు వెళ్లవచ్చు: ప్రకాశ్ జవదేకర్