ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Exams: ఏపీపీఎస్సీ పరీక్షల్లో ప్రశ్నలు మరింత కఠినంగా ఉంటాయా? - ఏపీపీఎస్సీ పరీక్షలు తాజా వార్తలు

ఏపీపీఏస్సీ నుంచి వెలువడే 19 కేటగిరీ ఉద్యోగాల భర్తీ కేవలం రాత పరీక్ష ఆధారంగానే జరగనుంది. ఇప్పటివరకు రాత పరీక్షల్లో పోటాపోటీగా మార్కులు సాధించినా, మౌఖిక పరీక్షల్లో ముందు, వెనక అవుతున్నారు. ఏపీపీఏస్సీ ద్వారా భర్తీచేసే ఉద్యోగాలకు మౌఖిక పరీక్షలు ఉండవని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకవైపు మౌఖిక పరీక్షలను రద్దుచేయడంతో పాటు.. మరోవైపు గ్రూప్‌-1 మినహా మిగిలిన పోస్టుల భర్తీకి ఒక పరీక్షనే నిర్వహించాలని ఏపీపీఏస్సీ ప్రాథమికంగా నిర్ణయించింది. దీంతో ప్రశ్నపత్రం ఎలా ఉంటుందన్న దానిపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.

appsc exams will be held on a written test basis only
ఏపీపీఎస్సీ పరీక్షల్లో ప్రశ్నలు మరింత కఠినంగా ఉంటాయా?

By

Published : Jul 6, 2021, 7:33 AM IST

ఏపీపీఏస్సీలో ఇక నుంచి రాత పరీక్షలతోనే అభ్యర్థుల తలరాత మారనుంది. ఇప్పటివరకు రాత పరీక్షల్లో పోటాపోటీగా మార్కులు సాధించినా, మౌఖిక పరీక్షల్లో ముందు, వెనక అవుతున్నారు. ఏపీపీఏస్సీ ద్వారా భర్తీచేసే ఉద్యోగాలకు మౌఖిక పరీక్షలు ఉండవని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఏపీపీఏస్సీ నుంచి వెలువడే 19 కేటగిరీ ఉద్యోగాల భర్తీ కేవలం రాత పరీక్ష ఆధారంగానే జరగనుంది. ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను బట్టే ఏపీపీఏస్సీ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. గ్రూప్‌-1 ద్వారా 20 రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఇప్పటివరకూ మౌఖిక పరీక్షలను 75 మార్కులకు నిర్వహించారు. అధ్యాపకుల పోస్టులకు 50 మార్కులు, ఇంగ్లిష్‌ రిపోర్టర్‌, ఇతర పోస్టులకు 30 మార్కులకు ఇన్నాళ్లూ మౌఖిక పరీక్షలు జరిగాయి. రాతపరీక్షల్లో ఉండే మొత్తం మార్కుల్లో పది శాతాన్ని పరిగణనలోనికి తీసుకొని ఇంటర్వ్యూలు నిర్వహించారు.

ఒకవైపు మౌఖిక పరీక్షలను రద్దుచేయడంతో పాటు.. మరోవైపు గ్రూప్‌-1 మినహా మిగిలిన పోస్టుల భర్తీకి ఒక పరీక్షనే నిర్వహించాలని ఏపీపీఏస్సీ ప్రాథమికంగా నిర్ణయించింది. దీంతో ప్రశ్నపత్రం ఎలా ఉంటుందన్న దానిపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. 2016, 2017 సంవత్సరాల్లో తీసుకున్న నిర్ణయాలను బట్టి రాతపరీక్షల ప్రశ్నపత్రాలను ప్రస్తుతం రూపొందిస్తున్నారు. ప్రిలిమ్స్‌ కింద ఇచ్చే ప్రశ్నలు, ప్రధాన పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నలు దాదాపుగా ఒకే సిలబస్‌ నుంచి వస్తున్నాయి. ప్రిలిమ్స్‌లో అభ్యర్థుల విషయ పరిజ్ఞానాన్ని గమనించేలా, అనువర్తిత ప్రశ్నలు (అప్లికేషన్‌) ఉంటున్నాయి. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారే ప్రధాన పరీక్షలు రాయగలరు. ఇకపై గ్రూప్‌-1లోనే ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ఉంటాయి. మిగిలిన వాటికి ఒకటే పరీక్ష. దీనివల్ల అభ్యర్థుల సామర్థ్యాన్ని గుర్తించేలా ప్రశ్నలు కఠినంగా ఉంటాయని భావిస్తున్నారు. దీనివల్ల రాతపరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించడం పైనే దృష్టిపెట్టాలి.

మౌఖిక పరీక్షలు ఉన్నవి

  • గ్రూప్‌-1 (డిప్యూటీ కలెక్టర్‌), డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్‌ (సివిల్‌), అసిస్టెంట్‌ కమిషనర్‌ (వాణిజ్య పన్నుల శాఖ), జిల్లా పంచాయతీరాజ్‌ అధికారి, జిల్లా రిజిస్ట్రార్‌, ప్రాంతీయ రవాణా అధికారి, జిల్లా అగ్నిమాపక అధికారి, మున్సిపల్‌ కమిషనర్‌ (గ్రేడ్‌-2), అసిస్టెంట్‌ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌, అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌, జిల్లా ఎంప్లాయిమెంట్‌ అధికారి, ఇతర పోస్టులు.
  • సహాయ కమిషనర్‌ (కార్మిక), సహాయ సంచాలకుడు (వయోజన విద్య), గిరిజన, సంక్షేమ, బీసీ సంక్షేమాధికారి, సహాయ కమిషనర్‌ (దేవాదాయ), శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి.
  • ప్రభుత్వ పాలిటెక్నిక్‌, డిగ్రీ, జూనియర్‌ కళాశాలల అధ్యాపకులు, సెరికల్చర్‌ అధికారి, జిల్లా ప్రజాసంబంధాల అధికారి, తెలుగు రిపోర్టర్‌, ఇంగ్లిషు రిపోర్టర్‌, సహాయ ప్రజాసంబంధాల అధికారి, విస్తరణ అధికారి గ్రేడ్‌-1 సూపర్‌వైజర్‌ (మహిశా శిశు సంక్షేమ శాఖ).


ఇదీ చదవండి:

ఇకపై రెండు భాగాలుగా సీబీఎస్​ఈ సిలబస్

ABOUT THE AUTHOR

...view details