ఆలయ భూములకు నిరభ్యంతర ధ్రువపత్రాల (ఎన్‌వోసీలు) జారీకి సంబంధించిన దస్త్రాలను పరిశీలించేందుకు దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలోని నలుగురు అధికారులతో కమిటీని నియమించారు.ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ ఆదేశాలు జారీచేశారు. తొలుత ముగ్గురు అధికారులతో కమిటీ అనుకున్నప్పటికీ న్యాయ సలహాదారుని కూడా ఇందులో చేర్చారు. ఈ కమిటీలో అదనపు కమిషనర్/సంయుక్త కమిషనర్ (ఎస్టేట్స్), న్యాయ సలహాదారు, భూముల వ్యవహారాలు చూసే గెజిటెడ్ సూపరింటెండెంట్, ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌ను నియమించారు. ఎన్‌వోసీల కోసం కమిషనరేట్‌కు వచ్చిన అర్జీలను ఈ కమిటీ పరిశీలించి, కమిషనర్‌కు సిఫార్సు చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఆలయ భూముల ఎన్వోసీలకు కమిటీ నియామకం - ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలు
ఆలయ భూములకు నిరభ్యంతర ధ్రువపత్రాల (ఎన్‌వోసీలు) జారీకి సంబంధించిన దస్త్రాలను పరిశీలించేందుకు దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలోని నలుగురు అధికారులతో కమిటీని నియమించారు.ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ ఆదేశాలు జారీచేశారు.
ఆలయ భూముల ఎన్వోసీలకు కమిటీ నియామకం