రాజధాని అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఉనికిని ప్రశ్నార్థకం చేసే తప్పు చేస్తున్నారని పీసీసీ చీఫ్ శైలజనాథ్ ధ్వజమెత్తారు. రాజధానిగా ఆనాడు అమరావతికి ఎందుకు మద్దతు తెలిపారో ఆయన సమాధానం చెప్పి తీరాలన్నారు. అభివృద్ధి ఆగిపోతే రాష్ట్రం వెనకబడుతుందని గ్రహించాలని హితవు పలికారు. రాజధానిగా అమరావతికి అన్ని అర్హతలున్నాయనీ.. ఆ దిశగా జగన్ ఆలోచన చేయాలన్నారు.
సీఎం జగన్ రాష్ట్ర ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నారు: పీసీసీ చీఫ్ శైలజానాథ్ - ఏపీసీసీ శైలజానాథ్ తాజా వార్తలు
ముఖ్యమంత్రి జగన్.. రాజధాని విషయంలో రాష్ట్ర ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నారని పీసీసీ చీఫ్ శైలజనాథ్ విమర్శించారు. గతంలో అసెంబ్లీలో ఎందుకు మద్దతు తెలిపారో సమాధానం చెప్పాలన్నారు.
apcc chief sailajanath